08-10-2025 05:06:25 PM
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్..
హనుమకొండ (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా హనుమకొండ పట్టణంలో తాత్కాలిక బాణసంచా విక్రయాలతో పాటు, బాణాసంచా నిల్వ చేసుకొనేందుకు అనుమతి కోసం ఆసక్తి కల్గిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలసిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు ఫారంతో తప్పనిసరిగా అగ్నిమాపక విభాగం అధికారులు జారీ చేసిన ఎన్.ఓ.సితో పాటు, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు అయితే స్థల యజమాని అనుమతి పత్రం, అలాగే ప్రభుత్వ స్థలాల్లో అయితే సంబంధిత ప్రభుత్వ అధికారుల అనుమతి పత్రం, పక్క నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు అయితే పక్కవారి అనుమతితో పాటు పక్క భవన బ్లూ ప్రింట్ తో పాటు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఆదాలట్ శాఖలో ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జామ చేసినట్లుగా బ్యాంక్ చాలన్ తో దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీలోపు సంబంధిత జోన్లకు చెందిన డీసీపీ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు బాణసంచా అనుమతులు జారీ చేస్తారు.