08-10-2025 07:20:27 PM
ముంబై: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం దశ 1ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. దాదాపు రూ.19,650 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాండ్‌మార్క్ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అయిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ముంబైలోని ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారీ ట్రాఫిక్ భారాన్ని తగ్గిస్తుంది. 1,160 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ కొత్త విమానాశ్రయం భారతదేశ విమానయాన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది.
అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి కొత్తగా నిర్మించిన సౌకర్యాన్ని పరిశీలించారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించినంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఇప్పుడు ముంబైలో కొత్త విమానాశ్రయం ఉందని, ఇది ఆసియాలోనే అతిపెద్ద కనెక్టివిటీ హబ్ అవుతుంది" అని పేర్కొన్నారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం 'విక్షిత్ భారత్'ను ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని, ఈ కొత్త విమానాశ్రయంతో మహారాష్ట్రలోని రైతులు మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లకు అనుసంధానించబడతారు. ఈ ప్రాంతానికి పెట్టుబడులు, కొత్త వ్యాపారాలను ఆకర్షిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
బీజేపీ ప్రభుత్వ ప్రాంతీయ విమానాశ్రయ అభివృద్ధి కార్యక్రమం అయిన ఉడాన్ పథకం ప్రభావాన్ని ఉదేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. ఉడాన్ యోజన కారణంగా గత దశాబ్దంలో లక్షలాది మంది ప్రజలు తమ కలలను నెరవేర్చుకుంటూ మొదటిసారిగా ఆకాశంలోకి ఎక్కారు. కొత్త విమానాశ్రయాలు, సరసమైన విమాన ప్రయాణానికి ఉడాన్ పథకం దేశంలో విమాన ప్రయాణాన్ని సులభతరం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నవీ ముంబై విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు, పారిశ్రామికవేత్త గౌతం అదానీ పాల్గొన్నారు.