calender_icon.png 8 October, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీకేఎస్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

08-10-2025 05:12:28 PM

నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నకరేకల్ మండలం నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం మండల మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘం మండల గౌరవ అధ్యక్షులుగా యరకలి అంజయ్య, అధ్యక్షులుగా కొప్పుల అంజయ్య, కార్యదర్శిగా గుడుగుంట్ల బుచ్చి రాములు, ఉపాధ్యక్షులుగా పొడిచేటి వీరయ్య, చౌగోని ప్రభాకర్, సహాయ కార్యదర్శులుగా కొప్పుల వెంకటేశ్వర్లు, పుట్ట జానయ్య, మాధ వెంకట్ గౌడ్, సభ్యులుగా భూపతి వెంకన్న, అయితగోని లింగయ్య, కాడింగుల యాదయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు అంజయ్య బుచ్చి రాములు మాట్లాడుతూ నకిరేకల్ మండలంలో కల్లుగీత కార్మికులను సంఘటితం చేస్తామన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.