calender_icon.png 8 October, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులు డిజిటల్ లెర్నింగ్ తో బోధన చేయాలి

08-10-2025 07:24:03 PM

మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్..

హుజూర్ నగర్: విద్యార్థులకు ఉపాధ్యాయులు డిజిటల్ లెర్నింగ్ తో బోధన చేయాలని హుజూర్ నగర్ మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని శ్రీ గురుకులం పాఠశాలలో డివిజన్ పరిధిలోని గణిత, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ బోధనపై మూడు రోజులపాటు శిక్షణను ప్రారంభించారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులను ఉద్దేశించి మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులందరూ ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ బోధనతో అభ్యసన కార్యక్రమాన్ని అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా మెరుగుపరుచుకుని అభ్యసనలో బోధనలో వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి, రిసోర్స్ పర్సన్లు షేక్ జాఫర్, సిఆర్పిలు సైదులు, బ్రహ్మం, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.