08-10-2025 06:52:12 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలో తుర్కపల్లి మండలానికి చెందిన దయ్యంబండ తండా, మంచిరోని మామిళ్ల, బబ్లు తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గొంగిడి మహేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం మీద ప్రేమతో ఇంకా మరింత మంది వస్తారని తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.