calender_icon.png 1 September, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన దర్బార్లో అన్ని వివరాలతో ప్రభుత్వ సహాయానికి దరఖాస్తు చేయండి

01-09-2025 06:59:22 PM

గిరిజనుల కోరిన ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే ఆదివాసి గిరిజనులు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి అన్ని గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. సోమవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూసమస్యలు, కిరాణాషాపులు, ఫ్యాన్సీ స్టోర్లు రుణాల కొరకు, సోలార్ విద్యుత్ కనెక్షన్ ద్వారా కరెంటు, బోరు మోటారు ఇప్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి స్వయం ఉపాధి రుణాలు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో కరెంటు సౌకర్యం కొరకు, ఒంటరి మహిళ, వితంతు మహిళ ప్రోత్సాహాల కొరకు ,గిరిజన రైతులకు రైతుబంధు రుణాలు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, నూతనంగా మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్,ఏ డీఎం హెచ్ ఓ సైదులు, ఏవో సున్నం రాంబాబు,ఏడి అగ్రికల్చర్/ఎస్ ఓ భాస్కర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్,డిటి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, మేనేజర్ ఆదినారాయణ,  జేడీఎం హరికృష్ణ,ఇతర శాఖల సిబ్బంది ప్రమీల బాయ్, నరేందర్, చలపతి, జోగారావు, మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.