01-09-2025 10:26:42 PM
మందమర్రి,(విజయక్రాంతి): ఒకవైపు కుండపోతగా కురుస్తున్న వర్షం దీనికి తోడు గ్రామంలోని చెరువులు కుంటలు జలకళను సంచరించుకోగా గ్రామంలోని చెరువు పూర్తిగా నిండి నిండుకుండలా దర్శనమిచ్చింది. ఇదిలా ఉండగా చెరువు మధ్యలో వేసిన బోర్ నుండి గ్రామానికి మంచినీరు సరఫరా జరగాల్సి ఉండగా మోటార్లలో సమస్యలు తలెత్తడంతో గ్రామానికి త్రాగు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వర్షానికి గ్రామస్తులకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకూడదని భావించి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చెరువు పూర్తిగా మునిగినప్పటికీ గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి బోరు మోటర్ కు మరమ్మత్తులు చేసి గ్రామస్తుల తాగునీటి ఇబ్బందులు తొలగించారు.
మామిడి గట్టుకు చెందిన కారోబార్ కిషన్, గత రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు కుండపోతగా కురిసిన వర్షాలకు మండలంలోని మామిడిగట్టు గ్రామంలో మంచినీటి సరఫరా చేసే మోటార్లు పనిచేయక నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కారోబార్ కిషన్ ముందుకు వచ్చి గ్రామానికి చెందిన అప్సర్ను వెంటబెట్టుకొని వర్షంకు నీటిలో మునిగిన బోరు వద్దకు వెళ్లి బోర్ కు విద్యుత్ సరఫరా అయ్యే తీగలు తెగిపోవడంతో వాటిని సరిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఒకవైపు వర్షాన్ని మరోవైపు నిండుకుండలా ఉన్న చెరువులోని మోటర్ వద్దకు వెళ్లి బోరు మనమతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరింపజేసిన కిషన్, అప్సర్ ను గ్రామస్తులు అభినందించారు.