01-09-2025 06:55:55 PM
వనపర్తి టౌన్: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు "30 పోలీస్ ఆక్ట్" 1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.