calender_icon.png 2 September, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు మండపాలను సందర్శించిన మాజీ మేయర్

01-09-2025 10:39:53 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని పలు వినాయక మండపాలను మాజీ మేయర్, బిజెపి నాయకుడు వై సునీల్ రావు సోమవారం సందర్శించారు. భగత్ నగర్ లోని అయ్యప్ప గుడి సమీపంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాశ్మీర్ గడ్డ శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకొని అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖరాంపుర జియాన్ చర్చ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకొని అన్నదాన  కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు.