01-09-2025 10:43:51 PM
మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని ఏరియా జిఎం కార్యాలయంలో సోమవారం ఏరియా ఇంచార్జ్ జిఎం విజయ్ ప్రసాద్ పదోన్నతి పొందిన పలువురు ఉద్యోగులకు క్యాడర్ స్కీమ్ పదోన్నతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏరియా జిఎం కార్యాలయంలో పనిచేస్తూ జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ లుగా కేడర్ స్కీం ద్వారా పదోన్నతి పొందిన ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు.