16-07-2025 12:52:04 PM
హైదరాబాద్: మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం నాడు నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో(Indira Mahila Shakti Sabha) మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులను మహిళ సంఘాలకే అప్పగించామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల నుంచి తొమ్మిది బస్సులను ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు.
గతంలో కొందరు పెద్దమనుషుల నుంచే ఆర్టీసీలో బస్సులు అద్దెకు తీసుకునేవారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం మహిళలకే ఇచ్చామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం మహిళా సంఘాలకే ఇచ్చామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదాని మంత్రి స్పష్టం చేశారు. పెద్దపల్లిలో వీ హబ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఆంధ్ర ప్రాంతానికే నీళ్లు ఇవ్వడం గురించి మాత్రమే ఆలోచించారని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర జలహక్కుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ తాము రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. కాళేశ్వరం సమీపంలోని రైతులకు నీరు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు.