కొత్త కార్యదర్శుల నియామకం
నిర్మల్ (విజయక్రాంతి): జాతీయ మానవ హక్కుల సహాయ సంఘం(National Human Rights Assistance Commission) నిర్మల్ జిల్లా ఛైర్మన్ బి.శ్రీనివాస్ అధ్యక్షతనా నూతన కార్యదర్శులను మంగళవారం నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైస్ చైర్మన్ సయ్యద్ హైదర్ హాజరు కావడం జరిగింది. యస్.రాజుని(అడ్వకేట్) నిర్మల్ జిల్లా లీగల్ అడ్వైజర్ గా నియామకపత్రం అందజేయడం జరిగింది, సాజిద్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా నియామకపత్రాన్ని అందజేయడం జరిగింది.
మిగితా సభ్యులకు కూడా నియామక పత్రాలను అందజేసి వారికి అభినందనలు తెలియజేసారు, ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల సహాయ సంఘం నిర్మల్ జిల్లా ఛైర్మన్ గారు కొత్తగా నియామకం అయినా సభ్యులకు తగు సూచనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సహా చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ హెచ్ వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాధిక్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.






