calender_icon.png 6 July, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేటెడ్ కమ్యూనిటీల్లోకి పోస్ట్‌మెన్‌లను అనుమతించాలి

06-07-2025 01:04:03 AM

జీహెఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): పోస్ట్‌మెన్‌లను గేటెడ్ కమ్యూని టీల్లోకి అనుమతించాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాస్‌పోర్టులు, ఆధార్‌కార్డులు, డ్రై వింగ్ లైసెన్సు తదితర డాక్యుమెంట్స్ డెలివరీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నా మని జీహెఎంసీ దృష్టికి  పోస్టల్ డిపార్ట్‌మెంట్ పోస్టల్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరక్టర్ శరత్‌కుమార్ తీసుకొచ్చారు.

ఈ మేరకు జీహెఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశా రు. పోస్ట్‌మెన్‌లను లిఫ్టుల్లోకి అనుమతించడంతో పాటు వారికి పార్కింగ్ ప్లేస్ కల్పిం చాలని ఆదేశించారు. గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్‌మెంట్లు పోస్ట్‌మెన్‌లను అనుమతించాలని ఆదేశించారు. ఆపితే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.