calender_icon.png 25 May, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో వృద్ధులున్నారా!

25-05-2025 12:00:00 AM

వయసులో ఉన్నప్పుడు కుటుంబం కోసం కష్టపడి, జీవితంలోని చివరి మజిలీకి చేరుకుంటారు వృద్ధులు. వయసు పెరిగే కొద్దీ వారు చిన్న పిల్లలతో సమానం. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కాలం గడిచే కొద్దీ వారు తమ పని తాము చేసుకోలేరు. అన్ని సమయాల్లో వారికి అందుబాటులో ఉండటం కుటుంబసభ్యులకు కూడా కుదరకపోవచ్చు. కాబట్టి వృద్ధులున్న ఇంట్లో కొన్ని జాగ్రత్తలు, మార్పులు చేయడం తప్పనిసరి. అవేంటో చూద్దాం.

అవసరమైన చోట్ల వీల్ ఛైర్, వాకర్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయాలి.

టాయిలెట్లు, షవర్ల దగ్గర హ్యాండ్ రెయిల్స్, గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేయాలి. సాధారణ టాయిలెట్లకు బదులు ఒక్కటైనా రైజ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేయించడం మంచిది.

ఇంట్లోకి వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూడాలి. స్మోక్, హీట్ డిటెక్టర్లను ఇన్‌స్టాల్ చేయించాలి.

అనవసరమైన ఫర్నిచర్, సామగ్రి అడ్డదిడ్డంగా లేకుండా సర్దుకోవాలి. టెలిఫోన్, ఇంటర్నెట్ వైర్లను కాళ్లకు అడ్డం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంట్ కనెక్షన్లు షార్ట్ సర్వ్యూట్ కాకుండా జాగ్రత్త వహించాలి. 

నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారుంటే ఆటో సెన్సార్లను ఇన్‌స్టాల్ చేయించడం ద్వారా రాత్రుళ్లు వారి కదలికలపై కన్నేసి ఉంచొచ్చు.