calender_icon.png 25 May, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 ఏళ్లు దాటాయా..

25-05-2025 12:00:00 AM

మన వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఈ సమస్యలు ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ  ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామాలు, తీసుకునే ఆహారం విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. 

కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరైన చర్య కాదని.. వ్యాయామంతో పాటు సరైన విశ్రాంతి కూడా శరీరానికి అవసరమని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలసట ఎక్కువ కాలం కొనసాగితే రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. 

సాధారణంగా 50 ఏళ్ల వయస్సు స్త్రీలలో బలం తగ్గుతుంది. అందుకే కండరాల బలాన్ని పెంచే వ్యాయామం చేయడంపై శ్రద్ధ వహించాలి. యోగా, ధ్యానం వంటివి చేయాలి. జిమ్‌లో ఎక్కువ బరువులు ఎత్తడం, దూకడం, పరిగెత్తడం వంటివి శరీరంపై ఒత్తిడికి కారణమవుతాయి.

అందుకే ట్రైనర్ పర్యవేక్షణలోనే వ్యాయామాలు చేయాలి. క్రాష్ డైట్‌లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్రోటీన్లు, విటమిన్లు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.