calender_icon.png 5 August, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ఎన్నికల బరిలో నువ్వా? నేనా?

27-07-2025 12:00:00 AM

బీజేపీని గత 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. ఆ తరువాత ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ సహకారంతో ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరె న్స్ జమ్ము కాశ్మీర్‌లో, జార్ఖండ్ ముక్తి మో ర్చా జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో విజ యం సాధించాయి. కీలక రాష్ట్రాలైన హ ర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం బీజేపీనే గెలిచి సత్తా చాటిం ది. 2025 నవంబర్‌లో బీహార్‌లోని 234 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికలు దేశ రాజకీయా లను ప్రభావితం చేసేవని ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూట మి, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా ఘట్బంధన్ భావిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా రెండు కూటముల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపుపై రెం డు పక్షాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరుస పరాజయాలతో డీలా పడిన ఇండి యా కూటమి, ఆ కూటమిలోని పార్టీలు కనీసం బీహార్‌లోనైనా విజయం సాధించాలని ఉవ్విళూరుతున్నాయి. అలాగే ము న్ముందు జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం శాసనసభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నాయి.

ఎన్డీఏ అధికారం నిలబెట్టుకునేనా?

బీహార్‌లో ఏ పార్టీ అయిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 శాసనసభ స్థా నాల్లో విజయం సాధించాలి. అదే అక్కడి మేజిక్ ఫిగర్. గత శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 శాసనసభ స్థానాల్లో మాత్రమే గెలిచి బోటా బోటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కా నీ, గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో ఎ న్డీఏ భాగస్వామ్య పక్షమైన బీజేపీ బలం పె రుగుతున్నప్పటికీ, మరొక కీలక భాగస్వా మ్య పక్షమైన జనతాదళ్ (యు) ప్రభావం మాత్రం తగ్గుతున్నది. అంతేకాదు.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నిలకడలేని తనం (పల్టీ రామ్), పేదరికం, నిరుద్యోగం, వలసలు, ఆశించిన స్థాయిలో బీహార్ లో అభి వృద్ధి జరగకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్.. లాంటి అంశాలు ప్రభుత్వ ప్ర తిష్టను మసకబారుస్తున్నది. ఈ నేపథ్యం లో విపక్ష మహా ఘట్బంధన్ నుంచి అధికారపక్షం బలమైన పోటీని ఎదుర్కొంటు న్నది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికారపక్ష కూటమి 47 శాతం ఓట్లను సాధిం చగా, విపక్ష మహా ఘట్బంధన్ 39 శాతం ఓట్లను సాధించింది. దీన్నిబట్టి రెండు కూ టముల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 8 శాతం మాత్రమే. శాసనసభ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడక కాదని గ్రహించిన కేంద్రంలోని బీజేపీ.. 2025 26 కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు మకాన్ బోర్డ్ ప్రకటనతో పాటు నిధులను, ప్రాజెక్టులను కేటా యించింది. అలాగే గెలుపు కోసం వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పెన్షన్ పెంపు, మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు, 125 యూనిట్ల వర కు ఉచిత విద్యుత్, కోటి ఉద్యోగాల కల్పన, యువజన కమిషన్ లాంటి పథకాలను ప్ర కటించారు. తమను గెలిపించాలని ఓటర్ల పై వరాల జల్లు కురిపించారు మరోవైపు అమిత్ షా, మోదీ మంత్రాంగం, కూటమిలోకి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృ త్వంలోని ఎల్‌జేపీ చేరడం రాజకీయంగా కలిసి వస్తుందని ఎన్డీఏ కూటమి భావిస్తుం ది కానీ, విపక్ష మహా ఘట్బంధన్ ని ఎదుర్కొని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తేజస్వి భవితవ్యానికి పరీక్ష 

బీహార్ భవిష్యత్తు నాయకునిగా ఎదగాలనే తేజస్వి యాదవ్ కలలకు శాసనసభ ఎన్నికలు పరీక్షగా నిలవబోతున్నాయి. తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్‌లా, తల్లి రబ్రీదేవిలా.. తాను కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఈసారైనా నెరవేరుతుం దా లేదా మరొకసారి నిరాశే ఎదురవుతుం దా అనేది శాసనసభ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. బీహార్‌కు ఇప్పటికే రెండు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వి యాదవ్ ఎలాగైనా మహా ఘ ట్బంధన్‌ను గెలిపించి ముఖ్యమంత్రి పీఠా న్ని అధిష్ఠించాలనే వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తేజస్వీ రాష్ట్రీయ జనతా దళ్‌ను 75 శాసనసభ స్థానాల్లో గెలిపించారు. తద్వారా తన పార్టీని శాసనసభలో అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. కూటమితో 110 శాసనసభ స్థానాల్లో విజయం సాధించి అధికారానికి అడుగు దూరంలో నిలబడ్డారు. 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం తేజస్వి యాదవ్‌కు ప్రతిబంధకంగా మారి న నేపథ్యంలో మహా ఘట్బంధన్‌ను విస్తరించి భాగస్వామ్య పార్టీలను సమన్వయం తో ముందుకు నడిపించగలిగితే విజయం వైపునకు తేజస్వి యాదవ్ అడుగులు పడతాయి.

తేజస్విని ముఖ్యమంత్రిగా చూడా లని 38 శాతం బీహారీలు కోరుకుంటున్నారంటే, బీహార్ రాజకీయాల్లో తేజస్వి బలం ఎంతుందో అంచనా వేయవచ్చు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో చిన్న పార్టీ లు, కొత్త పార్టీలు ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన సురాజ్య పార్టీ, కుర్మి సామాజిక వర్గ నేత ఆర్‌సీపీ సింగ్ ఆప్ సబ్‌కీ ఆవాజ్ పార్టీ, శివ దీప్ లాండే హిందూ సేన పార్టీ, ఐపీ గుప్తా ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీ, ముఖే ష్ సహని వీఐపీ పార్టీ, రాష్ట్రీయ లోక్ మంత్ పార్టీలతో పాటు గత శాసనసభ ఎన్నికల్లో 1.2 శాతం ఓట్లను సాధించి ఐ దు శాసనసభ స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం పార్టీ కూడా ఎన్నికలలో కీల కం కాబోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ జన సురాజ్య పార్టీ పాత్ర పైన రాజకీయ వర్గా ల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్ర శాంత్ కిషోర్‌తో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, మరికొన్ని చిన్న పార్టీలు కలి సి కూటమిగా ఏర్పడితే, ఆ పార్టీలు సాధిం చే ఓట్లు సీట్లు, బీహార్ శాసనసభ ఎన్నికల్లో కూటముల జయాపజాయాలను ప్ర భావితం చేయగలుగుతాయి 

ఎవరు ఎటు వైపు?

ఎన్డీఏ కూటమిలో జనతాదళ్ (యూ), బీజేపీ, లోక్ జన్‌శక్తి పార్టీ (రాం విలాస్), హిందూస్థానీ అవామ్ మెర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా, మహా ఘట్బంధన్‌లో రా ష్రీయ జనతాదళ్, కాంగ్రెస్, పలు వామపక్ష పార్టీలు, వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ, రా ష్ట్రీయ జనసాక్షి పార్టీ, జార్ఖండ్ ముక్తి మో ర్చాలో భాగస్వాములై ఉన్నాయి. ప్రతిపక్షాలు ఊహించినట్లుగానే రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత భారీ గా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోం ది. మరోవైపు ఓటర్ల పరంగా చూస్తే.. రా ష్ట్రంలోని మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో.. 6.60 కోట్లకు పైగా పేర్లను ముసా యిదా ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం ఇటీవల వెల్లడించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్ర క్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రక్రియ పూర్తి చేసి.. ఎన్యూమరేషన్ పత్రాలను ఎన్నికల సం ఘానికి సమర్పించేందుకు ఇంకా కొన్నిరోజుల సమయం ఉంది. ఇప్పటివరకు 83.66 శాతం ఓటర్ల వివరాలను సేకరించినట్లు తాజాగా ఈసీ వెల్లడించింది.

దేశ రాజకీయాలపై ప్రభావం..

బీహార్ శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దేశ రాజకీయాలపై ఎన్డీఏ తన ప ట్టుని మరింత బిగించాలన్నా, ఇండియా కూటమి బలపడాలన్నా బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలిచి తీరాలి. 135 లోక్‌సభా స్థానాలున్న ఈ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ పార్టీకి, కూటమికి రాజకీయంగా దేశంలో బలం పెరుగుతుంది. బీహార్ శాసనసభ ఎన్నికల వేళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో 56 లక్షల ఓట్లను తొలగించటం ఏ పార్టీకి కూటమికి నష్టం చేస్తుందో ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరుగుతున్న ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నాయో బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగి, ఆ ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

వ్యాసకర్త సెల్: 98854 65877