calender_icon.png 5 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావి ఉపాధ్యాయులకే బోధన కరువు

27-07-2025 12:00:00 AM

ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గది లో నిర్ణయమవుతుందని పెద్దలంటారు. మరి వారికి పాఠాలు చెప్పేవా రికి ఎలాంటి శిక్షణ ఉండాలనేదే ప్రశ్న. భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి కచ్చితంగా నాణ్యమైన శిక్షణ ఉండా లి. ఉత్తమ బోధన జరగాలి. కానీ, రాష్ట్రం లో అది జరగడం లేదు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మొదలుకొని ఉపాధ్యాయ శిక్షణ సంస్థ లైన బీఎడ్, డీఎడ్, ఎస్సీఈఆర్టీ, ఐసీఎస్‌ఈల్లో ఉపాధ్యాయులు, అ ధ్యాపకులు, ఆచార్యుల భర్తీ సక్రమంగా లేక విద్యావ్యవస్థ కునారిల్లుతున్నది. గత సర్కార్ ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల నిర్లక్ష్య, నిర్లిప్తత ధోరణి అనుసరించింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చే సేందుకు కృషి చేస్తున్నారు.

గత ప్రభుత్వం లో ఒక్కసారైనా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అనేకసార్లు విద్యాశాఖపై రివ్యూ నిర్వహించారు. అలాగే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా కరెం ట్ సౌకర్యం కల్పించారు. విద్యాసంస్థలకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యమిచ్చారు. క్రమక్రమంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో ఉపాధ్యాయులు సరైన శిక్షణ లేకుండా దశాబ్ద కాలం నుంచి వి ద్యా సంవత్సరం పూర్తి చేస్తున్నారు. సర్టిఫికెట్ కూడా పొందుతున్నారు. సరైన శిక్షణ లేని ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేరు. వారికి కచ్చితం గా ప్రామాణికమైన శిక్షణ ఇవ్వాల్సిందే. 

డీఎడ్‌కు డిమాండ్..

ప్రస్తుతం డీఈఈ సెట్‌లో అర్హత పొం దిన అభ్యర్థులు డైట్ కళాశాలల్లో సీటు కోసం కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పాత 10 జిల్లాల్లో మాత్రమే డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (డైట్) కళాశాలలు ఉన్నా యి. ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పాలంటే సదరు అభ్యర్థి ఇంటర్మీడియ ట్ తర్వాత డైట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత సాధించి, డీఎస్సీ రాసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి కొలువు పొందాలి. గతం లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, ఆ తర్వా త బీఎడ్ పూర్తి చేస్తే, వారికి ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పేందుకు అవకాశం ఉండేది.

కొందరు డైట్ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు బీ ఎడ్ అర్హత సాధించిన వారు కాదని.. కొం దరు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకున్నారు. వా ద ప్రతివాదాల తర్వాత న్యాయస్థానం ప్రా థమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు బీఎడ్ అర్హత కారని జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో బీఎడ్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పేవారు తప్పకుం డా డీఎడ్ పూర్తి చేసి ఉండాలని తీర్పు ఇ చ్చింది. దీంతో డీఎడ్‌కు అమాంతం డి మాండ్ బాగా పెరిగింది. మరోవైపు రెండు దశాబ్దాల నుంచి డైట్ కళాశాలలను ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత వేధిస్తున్న ది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల పరిధిలో ని 10 డైట్ కళాశాలల్లో కేవలం 25 మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు పాఠాలు బోధిస్తున్నారు. మిగ తావారంతా ఇతర విభాగాల నుంచి డి ప్యూటేషన్‌పై వచ్చి పాఠాలు చెప్పేవారే.

నిబంధనల ప్రకారం..

పాత 10 జిల్లాల్లోని డైట్ కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు దాదాపు 150 190 వరకు అన్ని సబ్జెక్టులు, మానసిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉండాలి. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ఉదాహరణకు హైదరాబాద్ లోని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గతేడాది జూలై 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత భర్తీ లేదు. ప్రస్తుతం ఆ కళాశాలలో ఇద్దరు ఈఎల్టీసీ (ఇంగ్లిష్ శిక్షణా తరగతులకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు) మాత్రమే ఉన్నారు. అలాగే మిగిలిన పాత తొమ్మిది డైట్ కళాశాలల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు.

మిగతా వారిని విద్యాశాఖ కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొని మమ అనిపిస్తున్నారు. డైట్ కళాశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు యేటా కొందరు పదవీ విరమణ చేస్తారు. ఆయా స్థానాలు ఖాళీ అయినప్పటికీ, కొత్తవారి భర్తీ జరగడం లేదు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల బదిలీలు, పదోన్న తులు సరిగ్గా లేవు. విద్యాసంస్థలపై పర్యవేక్షణ కూడా అంతంతమాత్రమే ఉంది. ఎంఎడ్., పీహెచ్‌డీ, పీజీ పూర్తి చేసి అర్హత కలిగిన ఉపాధ్యాయులు డైట్ కళాశాలల్లో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులకు పదోన్నతులు లభిస్తాయని ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నెరవేరడం లేదు. కొందరు ఎదురు చూసి, చూ సి పదవీ విరమణ సైతం చేశారు.

1/2005 యాక్ట్ రద్దు సాధ్యమేనా?

రాష్ట్రంలోని భాషా పండితులు ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ప్రాథమిక పాఠశా ల వేతనాలు తీసుకుంటూ శ్రమదోపి డీకి, వెట్టిచాకిరీకి గురయ్యారు. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉండా లని విద్యా కమిటీలు, విద్యా కమిషన్లు సి ఫారసు చేశాయి. తర్వాత ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం, బయాలజీ, సాంఘిక శా స్త్రం బోధించే ఉపాధ్యాయుల అప్‌గ్రేడ్ జరిగి వారికి స్కూల్ అసిస్టెంట్ హోదా వచ్చింది. తెలుగు, హిందీ, ఉర్దూ మిగతా దేశీయ భాషలు బోధించే ఉపాధ్యాయుల కు మాత్రం పదోన్నతులు కల్పించలేదు.

భాషా పండితులను అప్‌గ్రేడ్ చేయాలని అన్ని సర్కార్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నాడు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (ఇప్పుడు లేదు)కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. వారికి అవమానాలు, అవహేళనలే ఎదురయ్యాయి. పాఠశాల స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్‌లో భాషా పండితుల పేర్లు చివరన రాసి ఆత్మాభిమానం దెబ్బ తీసేలా ప్రయత్నాలూ జరిగాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు భాషా పండితులకు అనుకూలంగా వచ్చాయి. వారు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఉన్నత పాఠశాలల్లో పా ఠాలు బోధిస్తున్నారు. వారి కోసం 1/2005 యాక్ట్ రద్దు చేసి నోషనల్ కింద పరిగణించి ఆర్థిక భారం లేకుండా కేవలం సర్వీస్‌ను స్కూల్ అసిస్టెంట్లతో సమానం గా పరిగణనలోకి తీసుకోవాలని, అన్ని ఉ పాధ్యాయ సంఘాలు, భాషా పండిత సం ఘాలు, భాషా పండితులు కోరుతున్నారు.

వ్యాసకర్త సెల్ 92908 26988

శిక్షణా సంస్థల్లో ఉపాధ్యాయులు సరైన శిక్షణ లేకుండా దశాబ్ద కాలం నుంచి కోర్సు పూర్తి చేస్తున్నారు. సర్టిఫికెట్ కూడా పొందుతున్నారు. సరైన శిక్షణ లేని ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేరు. వారికి కచ్చితంగా ప్రామాణికమైన శిక్షణ ఇవ్వాల్సిందే.