28-07-2025 12:00:00 AM
వెదురు కర్రకు పూసిన
గులాబీ పువ్వు.. బొంబాయి మిఠాయి
ముద్దుగా పిలుచుకునే
కిర్ కిర్ మిఠాయి
కిర్ కిర్ మిఠాయి
కిర్ కిర్ సప్పుల్ల
కిన్నెర రాగాలు వినంగనే
ఏదో తెలియని సంబురం
వాడకట్టుకు రాంగనే
పెద్దలు పిల్లలవుతారు
పిల్లలు ఆనందపడతారు
మిఠాయిని నోట్లో వేసుకుని
సప్పరిస్తే ఆహా.. ఏం తృప్తి!
చేతికి గడియారంగా
వేలికి ఉంగరంగా..
హంసలు.. చిలుకలై
మా మనసుల్లో ఎగిరిన మిఠాయి
చాక్లెట్లు కాండీల బరువుకు
నేలరాలి కనుమరుగైంది!