10-11-2025 12:14:12 AM
ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 9: ఉపాధ్యాయుడిగా గత 30 సంవత్సరాలు ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడంలో విజయవంతమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటయ్య అని, విద్యాభివృద్ధికి అయన చేసిన సేవలు చాలా అమో ఘమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉపాధ్యాయ వృత్తికి సచ్చంద పదవీవిరమణ చేసిన సందర్భంగా తిరుమల హిల్స్‌లోని రిషి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వెంకటయ్యకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “విద్య మన సమాజానికి వెలుగునిచ్చే శక్తి. ఆ వెలుగును పంచడం అంటే సర్వోత్తమ సేవ అని, 30 ఏళ్లపాటు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించి, ఎన్నో కుటుంబాలకు ఆశా కిరణంగా నిలిచిన వెంకటయ్య గారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వెంకటయ్య పాత్ర అపూర్వం” అని పేర్కొన్నారు. అనంతరం వెంకటయ్య దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, బేస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్, రిషి విద్యాసంస్థల డైరెక్టర్లు , రిషి విద్యాసంస్థల స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.