calender_icon.png 3 July, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు రైతులను మోసం చేయొద్దు

03-07-2025 06:35:42 PM

ఆ భూములలో వారికి నచ్చిన పండ్ల మొక్కలనే పెంపకం చేయాలి..

కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు..

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ ప్రజలతో గ్రామ సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ... మీ పోడు సమస్యలన్నిటిని సీతక్క దృష్టికి తీసుకొనిపోతాం. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాము సీతక్కని నేరుగా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చేల వినయ్ ఏటూరునాగారం టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.