calender_icon.png 3 July, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

03-07-2025 06:42:14 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సౌకర్యాలను వినియోగించుకుని చక్కగా చదువుకోవాలని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎస్ఐ కుశ కుమార్(SI Kusha Kumar) అవగాహన కల్పించారు. పోలీసు జాగృతి బృందం ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... లక్ష్యంతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.