calender_icon.png 3 July, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమ లింగం కాల్వకు నీటి విడుదల

03-07-2025 06:39:09 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ(Valigonda) అక్కాచెల్లెచెరువు నుండి దిగువ ప్రాంతానికి వెళ్లే భీమలింగం కాలువపై నూతన వంతెనల నిర్మాణం కారణంగా నీటిని నిలిపివేయడం జరిగింది. దీంతో దిగువ ప్రాంతానికి చెందిన వందలాదిమంది రైతులు తమ వేలాది ఎకరాల పంటలను కోల్పోతున్నామని రైతులు, బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. అయితే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భీమలింగం కాల్వకు నీటిని అనుకున్న సమయానికంటే ముందుగానే విడుదల చేయడం జరిగింది. దీంతో నీటిని విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.