20-12-2025 07:29:58 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని ఆరిందా, మల్లారం మాజీ సర్పంచ్ కాసిపేట సాంబయ్య బిజెపి పార్టీ లో చేరారు. మంథని పట్టణంలోని రామ్ రెడ్డి కాంప్లెక్స్ లో శనివారం మంథని నియోజకవర్గంలో గెలుపొందిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జీ రాజమౌళి గౌడ్, బిజెపి పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జీ చంద్రుపట్ల సునీల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి మాజీ సర్పంచ్ కాసిపేట సాంబయ్యకు బిజెపి పార్టీ కండువా కప్పి సంబయ్యను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బిజెపి పార్టీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేకూర్చే విధంగా వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడిని అయి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి నాయకత్వంలో మంథని మండలంలో బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, మంథని మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, బిజెపి పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.