calender_icon.png 20 December, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

20-12-2025 09:27:49 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్ లతో కలిసి తహసిల్దార్లు, చర్చ్ ల ఫాదర్లు, సంబంధిత శాఖల అధికారులతో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ వేడుకలను శాంతియుత వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతి రిజిస్టర్డ్ చర్చ్ కు సున్నం, విద్యుత్ దీపాల కొరకు రూ.30 వేలను అందిస్తుందని తెలిపారు.

సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్, కౌటాల, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, రెబ్బెన లలో 4 చోట్ల వేడుకలను నిర్వహించేందుకు 4 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ నీతులను సంబంధిత తహసీల్దారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్ నగర్, కౌటాల తహసీల్దారు, చర్చ్ ల ఫాదర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.