calender_icon.png 20 December, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్షిత ప్రయాణంపై ప్రజల్లో అవగాహన పెంచుతాం

20-12-2025 07:27:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సురక్షిత ప్రయాణం ప్రమాదాల నివారణ పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రమణ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు శనివారం వీడియో ప్రమాదాల నివారణపై సూచనలు చేసినట్టు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సురక్షిత డ్రైవింగ్ తదితర అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, వైజాగ్ అమ్మద్ సబ్ కలెక్టర్ సాకేత్ కుమార్, రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.