calender_icon.png 20 December, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దృష్టిలోపం.. కళ్ళజోడు అందించేందుకు అభినందనీయం

20-12-2025 09:17:24 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): దృష్టిలోపం ఉన్నవారికి భారత్ డైనమిక్ లిమిటెడ్ (భారత రక్షణ మంత్రిత్వ శాఖ), బ్లెండ్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ కళ్ళజోడు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్. పి. నితిక పంత్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ లతో కలిసి హాజరై 26 మంది దృష్టిలోపం ఉన్నవారికి స్మార్ట్ విజన్ కళ్ళజోళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో బ్లెండ్ విజన్ ఫౌండేషన్ వారు సామాజిక బాధ్యతలో భాగంగా దృష్టిలోపం ఉన్నవారికి కళ్ళజోడు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కళ్ళజోడు ధర రూ.40 వేలు ఉంటుందని, ఇవి ఎ. ఐ. సాంకేతికత ఆధారంగా బెంగళూరుకు చెందిన జాతీయ సంస్థ ఎస్. హెచ్. జి. టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డాయని తెలిపారు. ఈ కళ్ళజోళ్లను సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చి చూపులేని అభాగ్యులను ఆదుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.