20-12-2025 09:22:43 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డ్రీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఎంపిక చేయబడిన పాఠశాలలకు సైన్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారి తో కలిసి ఎంపికైన పాఠశాలలకు సైన్స్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం వలన అభ్యాసనా ఫలితాలు చిరస్థాయిగా ఉంటాయని, వార్షిక పరీక్షలలో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు సైన్స్ కిట్లను డ్రీమ్ ట్రస్ట్ వారు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.