calender_icon.png 12 August, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూటర్న్ తీసుకునేలా దారుల ఏర్పాటు

11-08-2025 01:26:36 AM

  1. అడ్డదారులు. అర చేతిలో ప్రాణాలు కథనాని స్పందన

ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ ఆగస్టు 10 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన ఇస్తా హౌస్ నుంచి భూ త్పూర్ రోడ్డు వరకు నిర్మించిన బైపాస్ రోడ్డు మార్గమ ధ్యలో ఇష్టం సారంగా అడ్డదారులను కొందరు ఏర్పా టు చేసుకున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం బైపా స్ రోడ్డులో రెండు చోట్ల అధికారికంగా యూటర్న్ తీసుకు నేందుకు దారులు ఏర్పాటు చేసినప్పటికీ అనధికారికంగా ఐదు చోట్ల యూటర్న్ తీసుకున్నందుకు కొందరు వాహన చోదకులు యూటర్న్ తీసుకునేలా దారులను ఏర్పాటు చేసుకున్నారు.

అనధికారికంగా యూటర్న్లో ఉండడంతో ఆ ప్రాంతాల్లో యూటర్న్లో తీసుకుంటున్న క్రమంలో వాహన చోదకులకు పలుమార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై విజయ్ క్రాంతి దినపత్రిక ’అడ్డదారులు.. అరచేతిలో ప్రాణాలు’ అనే కథనం ప్రచురితం చేసింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్పందించారు. వెంటనే పూర్తిస్థాయిలో పరిశీలన చేసి అనధికారికంగా ఉన్న యూటర్న్ తీసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని విజయక్రాంతి దినపత్రికకు తెలియజేశారు.