calender_icon.png 12 August, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కలను దత్తత తీసుకోండి

11-08-2025 01:28:01 AM

- జీహెఎంసీ వినూత్న కార్యక్రమం

- ‘బీ ఏ హీరో.. అడాప్ట్, డోంట్ షాప్’ నినాదంతో 17న ప్రత్యేక దత్తత మేళా

- జలగం వెంగళ్‌రావు పార్కులో ఉదయం 6 గంటల నుంచి ఏర్పాట్లు

 హైదరాబాద్,సిటీబ్యూరో అగస్టు 10 (విజయక్రాంతి): వేల రూపాయలు పోసి విదేశీ జాతి కుక్కలను కొనుగోలు చేసే సంస్కృతికి భిన్నంగా, ప్రేమను పంచే దేశీ కుక్కపిల్లలకు నీడనివ్వాలని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపునిస్తోంది. “బీ ఏ హీరో. అడాప్ట్, డోం ట్ షాప్‌” హీరో అవ్వండి, కొనకండి, దత్తత తీసుకోండి.. అనే నినాదంతో వీధి కుక్కపిల్లల కోసం ఒక ప్రత్యేక దత్తత మేళాను నిర్వహించనుంది.

ఈ నెల 17న

ఈ ప్రత్యేక దత్తత కార్యక్రమం ఈనెల 17వ తేదీ, శనివారం ఉదయం 6:00 గం టల నుంచి 10:00 గంటల వరకు బంజారాహిల్స్, రోడ్ నం. 1లోని  జలగం వెంగ ళ్‌రావు పార్కు వేదికగా జరగనుంది. నగరం లో ఆదరణకు నోచుకోని ఎన్నో కుక్కపిల్లలకు సురక్షితమైన, ప్రేమపూర్వకమైన గృహాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వి భాగం అధికారులు తెలిపారు. వీధికుక్కల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపును పోగొట్టేందుకే జీహెఎంసీ ఈ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది.

 ఆరోగ్యకరమైన కుక్క పిల్లలు

ఈ మేళాలో దత్తత కోసం అందుబాటులో ఉంచే కుక్కపిల్లల ఆరోగ్యం విష యం లో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ప్రతీ కుక్కపిల్లకు పశువైద్యులచే ఆరోగ్య పరీక్షలు నిర్వ హించి, నులిపురుగుల నివారణకు మందు లు డీవార్మింగ్ వేయించి, ప్రాణాంతక వ్యా ధులు రాకుండా అవసరమైన ప్రాథమిక టీకాలను కూడా వేయించారు.  

ఖర్చు లేదు.. కావాల్సింది మీ కరుణ మాత్రమే

దత్తత ప్రక్రియ పూర్తిగా ఉచితం. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కావాల్సిం దల్లా వాటిని ప్రేమగా చూసుకునే విశాల హృదయం మాత్రమే” అని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన పోస్టర్‌ను జీహెచ్‌ఎంసీ కమిష నర్ ఆర్.వి. కర్ణన్ తన అధికారిక ‘ఎ క్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా, జంతు ప్రేమికుల నుంచి విశేష స్పం దన లభిస్తోంది. నగరంలోని జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కరోజు మేళాతో కొన్ని మూగజీవాలకైనా కొత్త జీవితం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.