calender_icon.png 28 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

28-01-2026 12:57:19 AM

అధికారులకు కలెక్టర్ అభిలాష ఆదేశం.. జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

నిర్మల్, జనవరి ౨7 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని  కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు.

నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈనెల 28తో నామినేషన్ల సేకరణ చేపట్టి 11న ఎన్నికల పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ప్రజలు రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు సహకరించాలన్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు ర్యాలీలు అనుమతి తీసుకోవాలని సూచించారు . ఈ సమావేశంలోఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పి సీఈవో శంకర్, డీఈవో భోజన్న, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.