28-01-2026 12:58:50 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ రంగంలో యాజమాన్యాల ఏకపక్ష పోకడలు, మొండి వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగులు రణభేరి మోగించారు. తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించకుండా, ఉద్యోగ సంఘాలతో కనీస చర్చలు జరపకుండా బదిలీల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యో గుల ఐక్య వేదిక బుధవారం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న కార్పొరేట్ కార్యాలయం వద్ద మహా ధర్నాకు పిలుపునిచ్చింది.
ప్రస్తుత విద్యా సంవత్సరం మధ్యలో, వేసవి విద్యుత్ కార్యాచరణ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ముందస్తు చర్చలు లేకుండా జనరల్ బదిలీల గైడ్‌లైన్స్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 2026 వర కు బదిలీలను వాయిదా వేయాలని కోరు తూ ప్రభుత్వానికి, యాజమాన్యానికి పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందన రాకపో వడంతో ఆందోళన బాట పట్టాలని జేఏసీ నిర్ణయించింది.
యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణి వల్ల ఉద్యోగుల కు టుంబాలు ఇబ్బందుల్లో పడతాయని, ము ఖ్యంగా పిల్లల చదువులపై ప్రభావం పడుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బదిలీలే కాకుండా, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై కూడా ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. సిబ్బందికి ఇన్-ఛార్జ్ పదోన్నతులు కల్పించాలని, విద్యు త్ సంస్థల్లో వెన్నెముకగా పనిచేస్తున్న ఆర్టిజన్ల గ్రేడ్ అప్‌గ్రెడేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తోందని, సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఐక్య వేదిక నేతలు స్పష్టం చేశారు. ఈ ధర్నా నేపథ్యంలో బుధవారం నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌లను, ఇతర అధికారిక విధులను బహిష్కరిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఉదయం నుంచే రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా మింట్ కాంపౌండ్‌కు చేరుకోనున్నా రు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో ఈ ఆందో ళనను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.