21-09-2025 11:08:01 PM
ఆవాజ్, సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ సంపూర్ణ మద్దతు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండల పరిధిలో వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలో సుమారు ఐదు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు ప్రభుత్వం స్థల హక్కు పత్రము, వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని ఈనెల 22న సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ వాసుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆవాజ్ పట్టణ కార్యదర్శి, సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వేసుకొని బతుకుతున్న వారికి ప్రభుత్వం గుర్తించడంలో వైఫల్యం చెందుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి స్థలం ఇల్లు ఇస్తామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తిగా వైపని చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ఎన్ని పోరాటాలు చేసిన పాలకులకు చీమకుట్టినట్లుగా కూడా ఉండటం లేదని వారు అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిని తక్షణమే కొమరం భీం కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ఒక ప్రకటనలు డిమాండ్ చేశారు.