21-09-2025 11:05:13 PM
మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా..
కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యువజన పథకమునకు దరఖాస్తు చేసుకునే ఓబిఎంఎంయస్ పోర్టల్‌లో గల లోటుపాట్లను వెంటనే సరిచేయాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 21-55 సంవత్సరాల ఒంటరి మహిళలు, వితంతులు, విడాకులు పొందినవారు, వికలాంగ మహిళలు ఈ పథకానికి అర్హులని పేర్కొనగా, ఆన్లైన్ పోర్టల్ 45-55 సంవత్సరాల మహిళలకు మాత్రమే అర్హత చూపిస్తూ దరఖాస్తులను తిరస్కరిస్తోందని, అలాగే తండ్రి ఆధార్ కార్డు నంబర్ నమోదు తప్పనిసరి చేయడంతో, తమ తండ్రుల ఆధార్ లేని మహిళలు ఈ పథకం ద్వారా రూ. 50,000 రుణ సహాయం పొందటానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఈ లోటుపాట్లు అర్హులైన వితంతు, ఒంటరి, వికలాంగుల మైనారిటీ మహిళల సాధికారతకు అడ్డంకిగా నిలుస్తున్నాయని, వీటిని తక్షణం సవరించాలని యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.