21-09-2025 10:55:46 PM
ఉప్పల్ (విజయక్రాంతి): రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాల మేరకు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం చౌరస్తా వద్ద నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ తన సిబ్బందితో వాహన తనిఖీలను చేపట్టారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని హెల్మెట్ ధరించిలని మైనర్ లు డ్రైవింగ్ చేయవద్దని చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎస్సై మైబెల్లి సిబ్బంది పాల్గొన్నారు.