calender_icon.png 22 September, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.75 లక్షలతో బాలికల జూనియర్ కళాశాల ఆడిటోరియం

21-09-2025 11:02:58 PM

వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతినెల రూ.50 వేలు అందిస్తా..

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జగ్గారెడ్డి, నిర్మల సందర్శించారు. రూ.75 లక్షలతో నిర్మించనున్న ఆడిటోరియం పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, ఈ నిధులను టీజీఐఐసీ నుంచి కేటాయించామని జగ్గారెడ్డి వివరించారు. విద్యార్థులు, లెక్చరర్స్ తమకు హాస్టల్ కావాలని, ప్రస్తుతం ఉన్న భవనంపైన కొత్త తరగతి గదులు నిర్మించాలని జగ్గారెడ్డి, నిర్మలను కోరారు. ప్రస్తుతం 900 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, అదనంగా మరో 500 మంది విద్యార్థినిలకు సదుపాయం కల్పించాలని జగ్గారెడ్డిని ప్రిన్సిపల్  తెలిపారు. రెండువేల మంది విద్యార్థులు చదువుకోవడంతో పాటు హాస్టల్లోనూ ఉండేలా కళాశాల భవనం, కొత్తగా హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. అక్టోబర్ 10లోపు ఎస్టిమేషన్లు డిజైన్లు పూర్తిచేసి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళతానని వివరించారు.

విద్యార్థులందరూ ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ లు, లైబ్రరీ, తరగతి గదులు, ఇలా సకల సదుపాయాలను కల్పిస్తామని జగ్గారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. నాలుగేళ్ల క్రితం అరబిందో సహకారంతో ప్రస్తుతం ఉన్న భవనాన్ని 4 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తెచ్చామని జగ్గారెడ్డి తెలియజేశారు. తన కూతురు జయా రెడ్డి ని ఎలాగైతే చూసుకుంటానో, ఇక్కడున్న విద్యార్థినిలంతా తనకు అంతే సమానమని జగ్గారెడ్డి అన్నారు. ప్రైవేట్ గా ఒక లెక్చరర్ కావాలని, ఇందుకోసం కళాశాల ప్రిన్సిపల్ జగ్గారెడ్డిని కోరారు. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతినెల రూ. 50వేలు ఇందుకోసం అందించేలా ఏర్పాటు చేయిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య ఉందని చెప్పడంతో, త్వరలోనే ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి తెస్తామని నిర్మలా జగ్గారెడ్డి తెలియజేశారు.

తాము కాలేజీలో అడుగుపెట్టగానే ఎందుకు గట్టిగా చప్పట్లు కోడుతూ, అరిచారని విద్యార్థినులను అడుగగా,  మీరు ఒక గొప్ప వ్యక్తి, మీ మానవత్వాన్ని చూసి మేమంతా అభిమానులమయ్యామని విద్యార్థినిలు సమాధానం ఇచ్చారు. కళాశాల విద్యార్థులతో జగ్గారెడ్డి మాట్లాడుతూ, తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు తన భార్య నర్సు ఉద్యోగం చేసేదని, కానీ ఉద్యోగం చేయవద్దని తాను అప్పట్లో చెప్పానన్నారు. సీనియర్ అడ్వకేట్ వీరారెడ్డి, కొలిపాక మాణిక్ రావు తమ ఇంటికి వచ్చి నిర్మల ఉద్యోగం చేయాల్సిందే అని తనను ఒప్పించారని, ఆ తర్వాత నిర్మల ఉద్యోగం కొనసాగించినట్లుగా విద్యార్థులకు వివరిస్తూ, జగ్గారెడ్డి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నువ్వు సంపాదించిన ఆ డబ్బులు బయటనే ఖర్చయిపోతాయి. కనీసం నిర్మల ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు ఇంటి కోసం పనికొస్తాయని వారు అప్పట్లో జగ్గారెడ్డి తోచెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శితో పాజి అనంత కిషన్, మాజీ కౌన్సిలర్ కూన సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.