21-09-2025 11:26:00 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మొదటి రోజైనా ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలను తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో, ఉయ్యాల ఉయ్యాల పాటలతో ఆనందంగా వేడుకలను నిర్వహించారు. పూలనే పూజించే ఏకైక తెలంగాణ సాంప్రదాయ పండుగకు మహిళలు నూతన దుస్తులు ధరించి చప్పట్లతో, కోలాటాలతో ఆడుతూ పాడుతూ ఆనందంగా బతుకమ్మ ఆడి పాడారు.