calender_icon.png 22 September, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షంతో పోటీపడి బతుకమ్మ ఆడుతున్న మహిళలు

21-09-2025 11:31:28 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోటీపడి మరి మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. తీరొక్క పూలతో పూలను పూజించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో సాగే ఈ పండుగకు మహిళలు గౌరమ్మను పూజిస్తూ పూలు ఒక పద్ధతిలో పేర్చి బతుకమ్మగా చేశారు. ఇట్టి బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా పడుచులందరూ కలిసి ఒక వేదికగా ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ కలిసి ఆడుతూ తన్మయత్వం చెందుతారు. అలనాటి నుండి నేటి వరకు తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ ఆడటం ఆనవాయితీగా వస్తుంది. వర్షం కారణంగా ఇబ్బంది కలిగిన కూడా లెక్కచేయకుండ వరునుడితో పోటీపడి మరి నువ్వా నేనా అనే విధంగా మహిళలు బతుకమ్మ ఆడడం జరిగింది.