calender_icon.png 28 January, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభోదయ కాలనీ పేజ్3లో ‘అరైవ్ అలైవ్’ ప్రతిజ్ఞ

28-01-2026 12:23:01 AM

కుషాయిగూడ, జనవరి 2౭ (విజయక్రాం తి): రోడ్డు ప్రమాదాలు ప్రజల సహకారంతోనే అదుపు చేయవచ్చని  కుషాయిగూడ డివిజన్ ఏసీపీ వై వెంకట్ రెడ్డి అన్నారు మంగళవారం రాత్రి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుభోదయ నగర్ కాలనీ ఫేస్ 3 లో అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హజరైన కుషాయిగూడ డివిజ న్ ఏసీపీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన సూచించారు.

కుషాయిగూడ ఇన్స్పెక్ట ర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన కల్పించిన ప్పుడే ప్రజల మద్దతుతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.  రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పా టించేలా ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ శుభోదయం కాలనీ మాజీ అధ్యక్షులు నందన్‌గౌడ్, అధ్యక్షులు తిగుళ్ల రామచందర్ ప్రధాన కార్యదర్శి బలగం మల్లే ష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్. కె సిద్దు రాము లు. కోశాధికారి పి కృష్ణ, ఉప కోశాధికారి ఎన్ బాలరాజు కార్యవర్గ సభ్యులు. ఎన్ బాలరాజ్ గౌడ్ ఎస్ శ్రీకాంత్ ఎన్  రమేష్ . భాను నేత. కాలనీ పెద్దలు రమేష్ బాబు యాదయ్య గౌడ్, బల్ల ప్రసాద్. వరికుప్పల వెంకటయ్య.మహిళ కమిటీ సభ్యులు. రమాదేవి శోభ రాణి. తదితరులు పాల్గొన్నారు.