28-01-2026 12:22:02 AM
ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సీతక్క, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని, జనవరి 27 (విజయక్రాంతి): మేడారం లో గిరిజన మ్యూజియం ఎదురుగా హన్మకొండకు చెందిన చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ తరుణ్ రెడ్డి డాక్టర్ చంద్రిక దంపతులు, సమ్మక్కసారలమ్మ తల్లుల జాతరకు విచ్చేసే లక్షలాది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరాన్ని మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ముందుకు వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న చక్రవర్తి హాస్పిటల్ యాజమాన్యాన్ని, డాక్టర్ తరుణ్ రెడ్డి డాక్టర్ చంద్రిక దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు.