28-01-2026 12:23:27 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జనవరి 27 (విజయక్రాంతి): అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఆసాముల సమన్వయ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మాట్లాడుతూ. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో సిరిసిల్ల పట్టణంలోని అత్యధిక వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీ మద్దతును అందించి ఆశీర్వదించాలన్నారు.
ఇక్కడున్నవారు ఒక్కొక్కరు 100 మంది చొప్పున ప్రభావితం చేయగల వ్యక్తులుగా నేను భావిస్తున్న, ఇక్కడున్న సంఖ్య ప్రభావంతో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.సిరిసిల్లలో మూఢంచలుగా ఉన్న వస్త్ర పరిశ్రమ కు పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన దరిమిలా, గత ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ కోసం పెట్టిపోయిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.
గత ప్రభుత్వంలో యువరాజుగా వెలుగుంది సిరిసిల్ల ప్రజల కోసం తన చర్మంవలసి చెప్పులు కుట్టించినా తక్కువేనని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచి వస్త్ర పరిశ్రమకు ఎలాంటి లాభం చెయ్యలేదన్నారు.గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయలు 300 కోట్లపై చిలుకు బాకీలను ప్రజా ప్రభుత్వం తీర్చిందన్నారు.కేసీఆర్ పాలనలో 75 వేల కోట్ల అప్పుల నుంచి 2023 వరకు 8 లక్షల కోట్ల అప్పును చేసి రాష్ట్ర ఖజానాని లూటీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక వస్త్ర పరిశ్రమకు పని కల్పించి కోటి చీరలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలను సిరిసిల్ల లో తయారు చేయడం జరిగిందని తెలిపారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు .