calender_icon.png 24 August, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ అనంతరం అరుంధతి నగర్ అభివృద్ధి పనులు కొనసాగించాలి

24-08-2025 12:00:00 AM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): ఇటీవల అరుంధతి నగర్ బస్తిలో ప్రారంభమైన నూతన సివరేజి పైప్ లైన్ పనులను వినాయక చవితి పండుగ సందర్భంగా బస్తి వాసులు, గణేష్ మండపం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు నిమజ్జనం అనంతరం బస్తీలో పనులు కొనసాగించాలని వాటర్ వరక్స్, ఇంజినీరింగ్ అధికారులకు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ సూచించారు.

ఈ మేరకు శనివారం గాంధీ నగర్ లో కార్పొరేటర్ అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తవ్వకాలు జరిపిన బస్తి రోడ్లను పండుగ నిమిత్తం తాత్కాలికంగా మరమత్తులు జరిపి బస్తి ప్రజలకు సహారించాలని కార్పొరేటర్ కోరారు. సానుకూలంగా స్పందించినా అధికారులు కార్పొరేటర్ సూచనల మేరకు పనులు సాగుతాయని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, వాటర్ వరక్స్ డిజిఎం కార్తీక్ రెడ్డి, ఇంజినీరింగ్ శాఖ ఎఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది శంకర్, జగన్, బీజేపీ డివిజన్ అద్యక్షుడు వి.నవీన్ కుమార్, నేతలు ఆనంద్ రావు, సాయి కుమార్, బస్తి అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సతీష్, పవన్, విశాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.