24-08-2025 12:00:00 AM
-కాంగ్రెస్, ఆర్జేడీకి ఎజెండానే లేదు
-బీహార్‌లో ఇల్లీగల్ ఓట్లు.. హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, అంతర్గతంగా సమీక్షలు, చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపా రు. కాళేశ్వరం అంశంపై అధికార దు ర్వినియోగం జరిగిందని, నిర్మాణ సమయంలో అప్పటి సీఎం తప్పు చేస్తున్నారని పలువురు రిటైర్ ఇంజినీర్లు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విచారణ సీబీఐకి ఇవ్వాలని లేఖ రా సిందని, ఇప్పడు మాత్రం మౌనంగా ఉంటుందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ జరగాలన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్ మద్దతుపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మద్దతు ఇవ్వాలని తాము ఇప్పటివరకు ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. తాము అడగకముం దే వారు వారి నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత తొలిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉప రాష్ర్టపతి అవుతున్నారని చెప్పారు.
- 30 రోజులు జైల్లో ఉంటే రాజీనామా చేయాల్సిందే
- ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి
- కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలి
- సాంకేతిక కారణాలతో రామగుండంలో యూరియా ఉత్పత్తి ఆగిపోయింది
- మొయినాబాద్ ఫాంహౌస్ కేసుతో బీజేపీకి సంబంధం లేదు
- ఫిరాయింపుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే
-మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఓట్ల చోరీ జరిగిందని తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో ఎలా గెలిచిం దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీకి ఎజెండా అంటూ ఏమీ లేదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో మీడి యాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
బీహార్‌లో ఇల్లీగల్ ఓట్లు, హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు ఉన్నాయని, ఇది దేశవ్యాప్త సమస్య అని అన్నారు. తీవ్రమైన అవినీతి, నేరారోపణలు ఎదుర్కొని 30 రోజులు జైల్లో ఉంటే పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులెవరైనా పదవికి రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ బిల్లును తీసుకొస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఈ బిల్లు కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదని, దేశమంతా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడే వారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటే క్రైమ్ చేసినట్టా
గువ్వల బాలరాజు స్వచ్ఛందగా బీజేపీలోకి వస్తామంటే చేర్చుకున్నామని, ఫామ్ హౌజ్ ఇష్యూ కారణం కాదని వెల్లడించారు. మొయినాబాద్ ఫాంహౌస్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి వెళ్లడం సాధారణమని, అందులో దొంగతనం ఏముందన్నారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటే క్రైమ్ చేసినట్టా అని ప్రశ్నించారు. పార్టీ బలోపేతమవ్వడంలో చేరికలు ఒక భాగమని తెలిపారు. తమ పార్టీలోకి రావాలంటే ఎవరైనా రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఫిరాయింపుల అంశంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే అని ఎద్దేవా చేశారు.
50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తాం
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగారని, తెలంగాణకు ఇస్తామని ఒప్పుకున్నంత యూరియాను అందించినప్పటికీ మంత్రి అడిగిన యూరియాను కూడా ఇస్తామని తెలిపారు. రామగుండం ఫ్యాక్టరీలో సాంకేతిక కారణాల తో ఉత్పత్తి ఆగిపోయిందన్నారు. పేగులు మెడలో వేసుకుంటా, కళ్లు పీకి గోటిలాడుతా వంటి భాషను ఒక సీఎం మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న వారు కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని, శత్రువులు కాదని హితవు పలికారు.
11 ఏండ్లలో తెలంగాణకు ఏం ఇచ్చామనే అంశంపై పూర్తి నివేదికను త్వరలోనే అందిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఉప రాష్ర్టపతి అభ్యర్థిని బలి కా బకరాను చేస్తోందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదని, అనేక రకాల తప్పుల కారణంగా అధికారానికి దూరమయ్యామని వెల్లడిం చారు. హైదరా బాద్ మెట్రో రెండో దశకు సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మెట్రో నష్టాల్లో నడుస్తోందని, కొత్త లైన్ వేసేందుకు ఎల్ అంట్ టీ సుముఖంగా లేదన్నారు. బీహార్‌లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.