01-05-2025 02:52:51 PM
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్, సేవా తత్పరులు పసుమర్తి చందర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కేక్ కట్ చేసిన మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్బంగా మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు స్వీట్ లు పంపిణి కార్యక్రమం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ, మండల నాయకులు అభిమానులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్,యాసా శ్రీకాంత్, ఉబ్బనా రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.