calender_icon.png 22 November, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి

10-02-2025 12:00:00 AM

  • మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడుతో పాజి అనంత కిషన్ 
  • సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ఎన్నిక

సంగారెడ్డి ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి):  ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. ఆది వారం సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికలు పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో నిర్వహించారు.

జిల్లా నూతన అధ్యక్షునిగా పటాన్ చేరుకు చెందిన బెజుగం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చీకోటి దయాకర్ (సంగారెడ్డి), కోశాధికారిగా మాసానిపల్లి మల్లికార్జున్ (జోగిపేట), అదనపు ప్రధాన కార్యదర్శిగా పుల్లూరి ప్రకాష్ (సంగారెడ్డి) ఎన్నికయ్యారు.

ముఖ్యఅతిథిగా మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ హాజరై మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని చెప్పారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నాకర్ వ్యవహరించారు.

ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణ్, తాజా, మాజీ అధ్యక్షులు మునిగల మనిక్ ప్రభు, పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, కార్యదర్శి నామ భాస్కర్ పాల్గొన్నారు.