calender_icon.png 22 November, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన తెలుగు సాహిత్యం అంబేద్కర్ ప్రభావం సదస్సు

09-02-2025 10:51:26 PM

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 16వ వార్షికోత్సవ వేడుక బోయి విజయ భారతి ప్రాంగణం (విపంచి కళానిలయం) సిద్దిపేటలో ఆదివారం రెండవ రోజుతో ముగిసింది.  మొదటి సెషన్ అంబేద్కర్ స్ఫూర్తి కవి గాయక సమ్మేళనానికి డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ వహించారు. దళిత బహుజనులను చైతన్య పరుస్తూ వచ్చిన సాహిత్యం వెనుక అంబేద్కర్ సిద్ధాంతమే దాగి ఉందాని వివరించారు. అంబేద్కర్ స్ఫూర్తి - పాట ప్రభావము అను అంశముపై సుమారు గంట పాటు సాగిన కేంద్ర సాహిత్య యువపురస్కార తొలి గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ ప్రసంగసం సభికుల్ని అలరించింది. ఆలోచింపజేసింది. పాట పరిణామక్రమాన్ని, చైతన్యపరిచిన విధానాన్ని వివిధ ఉద్యమాల్లో పాట ప్రభావాన్ని తెలంగాణ సాధనలో పాట గొప్పతనాన్ని అంచలవారిగా వివరించారు. పాట ఆత్మగౌరవంతో పోరుగానమును భావుటాగా ఎత్తిందని పేర్కొన్నారు.

అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు పాట నిద్రపోలేదు నిద్రపోనివ్వకుండా అసమానతలపై సామాజిక చైతన్యం నింపిందని కేవలం అంబేద్కర్ స్పృహ, అంబేద్కర్ స్ఫూర్తి చైతన్యమే అని వెల్లడించారు. అనంతరం వైష్ణవ శ్రీ, శ్యామల కవి సమ్మేళనంలో సివి కుమార్, సుజాత ప్రసాద్, సిద్దెంకి యాదగిరి మొదలగు దాదాపు 30 మంది కవులు కవితా గానం చేశారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రభావం చూపుతూ అంబేద్కర్ మూల గ్రంథాలను అనువాదంతో పాటు స్వతంత్ర రచనలను చేసిన బోయి విజయభారతి స్మారక సభ రెండవ సెషన్ లో షహనాజ్ బేగం నిర్వహించగా అమర జ్యోతి అధ్యక్షతన జరిగింది. బోయ విజయభారతి తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని వారు రచించిన రచనలను పురాణాలను వైదిక సాహిత్యాన్ని మరో చూపులో తార్కికంగా ఏ విధంగా విశ్లేషించారో, అంబేద్కర్ స్ఫూర్తితో రచించిన రచనలను క్రోడీకరించి ప్రభావవంతంగా తిరునగరి దేవకీ దేవి ఆ మూల ఆగ్రహం ఉదాహరణలతో విశ్లేషించారు.

సామాజిక కార్యకర్త ఉద్యమకారులు కవి, రచయిత, విమర్శకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ ప్రసంగిస్తూ అంబేద్కర్ స్ఫూర్తి తెలుగు సాహిత్యం పై విరివిగా ప్రభావం చూపిందని రాజ్యాంగం స్థానంలో మరో రాజ్యాంగాన్ని ఊహించలేమని ఒకవేళ అమలుపరిచినట్లయితే అనాగరిక మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతుందని పేర్కొన్నారు. మనిషిని మనిషిగా చూసింది రాజ్యాంగం స్త్రీలకు వివక్ష లేని విస్తృతిని ఆత్మగౌరవాన్ని అందించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. రాజ్యాంగం అంటే పార్లమెంటు అసెంబ్లీ లు కావు స్వేచ్ఛ సమానత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేయడం. పౌరులకు అందరికీ సమానత్వాన్ని ఆత్మ గౌరవాన్ని అందజేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ మల్లీశ్వరి, కే రంగాచారి, పి. శంకర్, పప్పుల రాజిరెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.