calender_icon.png 8 January, 2026 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత పాఠశాలకు ఆర్యభట్ట గణిత ఛాలెంజ్‌లో అరుదైన ఘనత

07-01-2026 07:21:11 PM

- విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

కొత్తపల్లి,(విజయక్రాంతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఇ) బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ పోటీలలో పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు సీహెచ్ వెంకట మోక్షిత్, సీహెచ్ శ్రీశాంత్, కె.అగస్త్య విశ్రుత్ లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి 100 మంది జాబితాలో స్థానం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ తెలిపారు.

పాఠశాలకు సి.బి.ఎస్.ఇ బోర్డు నుండి ఇలాంటి గౌరవం దక్కడం మూడవ సారి కావడం విశేషం.  విద్యార్థులను, ఉపాధ్యాయులను, పాఠశాల సిబ్బందిని, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘనత దక్కడం ఎంతో గర్వ కారణమని పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ.ప్రసాదరావు తెలిపారు. డైరెక్టర్స్ రశ్మిత, అనుకర్ రావు, ప్రసూన, వినోదరావు, వియుఎం ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాద్యాయుడు గోపికృష్ణ, సమన్వయకర్తలు నాగరాజు, రాము, గైడ్ టీచర్ ఈ.సంపత్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.