07-01-2026 07:11:19 PM
శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో వారాంతపు సంత
కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ చారి
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజల ముంగిటికే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫలాలు లభిస్తాయని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్సి శ్రీకాంత్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వారాంతపు కూరగాయల సంతను శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలో శ్రీకాంత్ చారి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాలనీవాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాజా కూరగాయల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈ మార్కెట్ను కాలనీలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాలనీ ప్రజలకు నిత్యం అవసరమయ్యే తాజా కూరగాయలను నేరుగా మన ప్రాంతంలోనే అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలకే అందించాలనే సంకల్పంతో ఈ మార్కెట్ను ఏర్పాటు చేశామని ప్రతి వారం జరిగే ఈ సంతను, లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలతోపాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలే కాకుండా జవహర్ నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.