23-07-2025 12:12:26 AM
పవన్‌కల్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీశ్‌శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్, హరీశ్‌శంకర్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావటంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్‌కల్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దర్శక నిర్మాతలు పవన్ అభిమానులకు ఓ శుభవార్త తెలియ జేశారు. ఎన్నో రోజులుగా ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజా కబురు ఉత్సాహాన్ని నింపినట్టయ్యింది.
ఈ సినిమాలో శ్రీలీలతోపాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోందని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్లను పంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రాశీఖన్నా నటిస్తోందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వీటి ని నిజం చేస్తూ టీమ్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాలో రాశీఖన్నా ‘శ్లోక’ అనే పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తు తం షూటింగ్‌లో పాల్గొంటున్న రాశీఖన్నా పాత్ర తో సినిమాకు మరింత రానుందని టీమ్ చెబుతోంది.