calender_icon.png 23 July, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు స్టార్స్‌కు ఆ రోజు ఎంతో ప్రత్యేకం!

23-07-2025 12:10:53 AM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘వార్2’. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) బ్యానర్‌పై నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు గొప్ప స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్‌లను తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం అభిమానులకు సినిమా ద్వారా దక్కనుండటం విశే షం. అయితే, ఈ సినిమాకు.. 25వ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత గురించి కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హృతిక్, ఎన్టీఆర్.. ఇద్దరూ ఈ సంవత్సరం తమ సినీ ప్రయాణంలో 25 వసంతాలు పూర్తి చేసుకుంటుండటమే ఇందుకు కారణం. ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి వైఆర్‌ఎఫ్ ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేస్తోంది. ఈ మేరకు ఈ నిర్మాణ సంస్థ తాజాగా ట్రైలర్ లాంచ్ ప్రకటనను విడుదల చేసింది. “2025లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్, వీరు తమ సినీ ప్రయాణంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఇదొ క లైఫ్ టైమ్ మూమెంట్స్.

ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి జూలై 25న ‘వార్2’ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు యశ్‌రాజ్ ఫిల్మ్స్ తెలియజేస్తోంది. ఇది ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం! జూలై 25 తేదీని మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి” అని సంస్థ పేర్కొంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.