calender_icon.png 23 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నీ లియోన్ మరో ఐటం సాంగ్!

23-07-2025 12:13:46 AM

సన్నీ లియోన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో పలు సినిమాలు, ప్రత్యేక గీతాలతో ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యిందీ బాలీవుడ్ భామ. ఇప్పుడు మరో ఐటెం సాంగ్‌తో మరోసారి తెలుగు తెరపై మెరవనుంది. యోగేశ్ కల్లే, ఆకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘త్రిముఖ’. ఇందులో సన్నీలియోన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషురెడ్డి, చిత్రం శ్రీను, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రాజేశ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రా న్ని అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేశ్ మద్దాలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం ఇటీవలే చిత్రీకరించింది. ‘గిప్పా గిప్పా..’ అంటూ సాగే ఈ ఐటెం సాంగ్‌ను సన్నీ లియోన్, యోగేశ్ కల్లేలపై రూపొందించారు. ఈ పాటలో సన్నీ లియోన్‌తోపాటు ‘పొలిమేర’ ఫేమ్ సాహితీ దాసరి, ఆకృతి అగర్వాల్ వంటి 10 మంది సినీప్రముఖులు భాగమయ్యారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.